Srinivasa Kalyanam Movie Review


మూవీ రివ్యూ : "శ్రీనివాస కళ్యాణం"

(గమనిక : ప్రియమైన ప్రేక్షకులారా ..! ఇది మా అభిప్రాయం మాత్రమే, రివ్యూలు చదివి సినిమాలు చూడటం మానేయకండి, మీరు కూడా సినిమా చూసి మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. )

నటీనటులు:
నితిన్, రాశీఖన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, జయసుధ తదితరులు..

సంగీతం: మిక్కీ జె.మేయర్
కెమెరా: సమీర్ రెడ్డి
నిర్మాత: దిల్ రాజు-శిరీష్-లక్ష్మణ్
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
విడుదల తేదీ: 09/08/2018
రన్ టైమ్: 140 నిమిషాలు

కథ:
శ్రీనివాస్ (నితిన్), శ్రీదేవి (రాశీఖన్నా) చండీఘర్ లో పరిచయమై, ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే.. పద్ధతలంటే ప్రాణం పెట్టే శ్రీనివాస్ కుటుంబానికి, పద్ధతులంటే టైమ్ వేస్ట్ యవ్వారంలా చూసే పక్కా బిజినెస్ మ్యాన్ ఆర్.కె (ప్రకాష్ రాజ్)కి మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితులను శ్రీనివాస్ తన బుద్ధి కుశలతతో ఎలా దాటుకొచ్చాడు? పెళ్ళంటే ఏదో ఈవెంట్ అని భావించే బిజినెస్ మ్యాన్ ఆర్.కెకి ఆ పెళ్లి ప్రాముఖ్యత ఎలా తెలియజేశాడు? అనే విషయాన్ని సతీష్ వేగేశ్న చాలా సాంప్రదాయబద్ధంగా చెప్పేందుకు చేసిన ప్రయత్నమే "శ్రీనివాస కళ్యాణం".

విశ్లేషణ:

నితిన్, రాశీఖన్నా, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, జయసుధ ఇలా చెప్పుకోవాలే కానీ ఇంకో అరగంట చదివినా సరిపోనంత మంది ఆర్టిస్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నారు.తమ పాత్రలకు సదరు నటులు న్యాయం చేసారు.

నితిన్ చాలా కలం తరువాత సహజత్వం పాత్ర పోషించాడు. అతనికి మంచి మార్కులే పడతాయి, రాశిఖన్నా గ్లామర్ పాత్రలకన్నా పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉండే క్యారెక్టర్లు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న తరుణం లో ఇలాంటి పాత్రదొరకడం తన ఈజ్ అనేది తెలుస్తుంది. ఇక సినిమాలో ముఖ్య పాత్రధారి ప్రకాష్ రాజ్ మిలీనియర్ పాత్ర అద్భుతంగా పోషించాడు ఒక విధంగా తన పాత్ర లేకపోతె సినిమా ముందుకు సాగడం పెద్ద గగనం అయిపోయేది., అందరికంటే ఎక్కువగా ప్రకాష్ రాజ్ నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. ఇక నాయనమ్మగా "జయసుధ" గారి పాత్ర కథలో లోతుని పెంచేదే అయినప్పటికీ ఆవిడ వచ్చే ప్రతీ సీన్ కి "ఫ్యామిలీ ఆడియన్స్" ఏమో కానీ "యూత్ " మాత్రం డీలా పడిపోయి నీరసపడిపోవం కాయం.., ఇక రాజేంద్ర ప్రసాద్ ,నరేష్ , నందిత శ్వేతా, ఆమని, సితార, పూనమ్ కౌర్  క్యారెక్టర్ లు అలా అలా సాగిపోతాయి.

మిక్కీ జె మేయర్ సంగీతం బాగుంది ., పాటలతో పాటు నేపధ్య సంగీతంతో కూడా తన మార్క్ చూపించాడు., దిల్ రాజు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.,అప్పటి "శ్రీనివాస కళ్యాణం" హీరో   "విక్టరీ వెంకటేష్" వాయిస్ ఓవర్ తో   ఇప్పటి మన నితిన్  "శ్రీనివాస కళ్యాణం"  సినిమా ఓపెన్ అయ్యి శుభం కార్డు పడుతుంది., దర్శకుడు  "సతీష్ వేగేశ్న" "శతమానం భవతి" మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా బాగా తీసాడు అని చెప్పుకోవచ్చు .

మొత్తానికి "శ్రీనివాసకల్యాణం" ఒక మంచి సినిమా అని చెప్పడంలో సందేహం లేదు., ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ 
అయ్యే సినిమా., యూత్ కి మాత్రం ఇది భారంగా  అనిపించినా తప్పులేదు.
Cc : Filmy raja

Comments